గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెల్లడయ్యాయి. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార భాజపాకు గట్టి పోటీ ఇచ్చింది. ఐతే ప్రధాని నరేంద్ర మోడీ హవా గుజరాత్‌లోనూ కొనసాగటంతో కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. మొత్తం 182 సీట్లు ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు కనీస మెజార్టీ 92 సీట్లు కావాలి. కాగా భాజపా 99 సీట్లు సాధించి మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 80 చోట్ల, ఇతరులు 3 చోట్ల గెలుపొందారు.