Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై డెలివరీ బాయ్ అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 29 అక్టోబరు 2023 (17:50 IST)
ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై సరకులను హోం డెలివరీ చేసేందుకు వచ్చిన ఓ డెలివరీ బాయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో శుక్రవారం జరిగింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రేటర్ నోయిడాలోని హైరైజ్ అపార్టుమెంట్‌లో ఓ మహిళ నివాసముంటున్నారు. ఇంటికి అవసరమైన సరకులను ఆమె ఓ యాప్ ఆర్డర్ చేశారు. వాటిని తీసుకొని 23 ఏళ్ల సుమిత్ సింగ్ అనే డెలివరీ బాయ్ ఆమె ఇంటికి వెళ్లాడు. 
 
ఆ సమయంలో ఇంట్లో ఆమె ఒక్కరే ఉన్నారని నిర్ధరించుకున్న సుమిత్ సింగ్.. బలవంతంగా ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
 
అతని మొబైల్ సిగల్స్ ఆధారంగా అతడు ఉన్న చోటును గుర్తించి, అక్కడికి వెళ్లే సరికి, వాళ్లకు లొంగిపోయినట్లు నటించాడు. అంతలోనే ఓ పోలీస్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని పరారయ్యాడు. పోలీసులు అతడివెంట పరుగెడుతుంటే జరిపాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు అతడి కాళ్లపై ఎదురుకాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. 
 
ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు నోయిడా పోలీసులు వెల్లడించారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత కోర్టు ఎదుట హాజరుపరుస్తామని తెలిపారు. అక్రమంగా మద్యం అమ్మకాలు జరుపుతున్నాడన్న కారణంతో గతంలోనూ సుమిత్‌పై కేసు నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments