Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇసుక తవ్వకాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు టీడీపీ ఫిర్యాదు

Webdunia
ఆదివారం, 29 అక్టోబరు 2023 (17:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతలు ఇసుక మాఫియాకు తెరలేపారని, ఎన్జీటీ నిబంధనలు ఉల్లంఘించి ఇష్టానుసారంగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుపుతున్నారనీ, ఈ తవ్వకాలపై లోతైన దర్యాప్తు జరపాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టీడీపీ ఎంపీలు కనకనమేడల, కె.రామ్మోహన్నాయుడులు సీబీఐ, సీవీసీలకు ఫిర్యాదు చేశారు. ప్రి బిడ్ సమావేశాన్ని కోల్‌కతాలో రహస్యంగా నిర్వహించారని వారు చేసిన తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
ఏపీ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) నిబంధనలు పాటించడం లేదని వారు తమ లేఖలో ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల బినామీలకే టెండర్లు ఇస్తున్నారని వారు పేర్కొన్నార. ప్రీబిడ్ సమావేశాన్ని కూడా ఏపీ ప్రభుత్వం రహస్యంగా కోల్‌కతాలో నిర్వహించారని టీడీపీ నేతలు కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాయి. 
 
కస్టమర్లకు ముద్దులు ఇవ్వాల్సిందే.. మసాజ్ సెంటర్ ఉద్యోగినిపై ఒత్తిడి  
హైదారాబాద్ నగరంలోని ఓ మసాజ్ సెంటరుకు వచ్చే కస్టమర్లకు ముద్దులు పెట్టాలని, వారు కోరినట్టుగా నడుచుకోవాలంటూ మహిళా ఉద్యోగినికి మర్దన సెంటర్ నిర్వాహకులు ఒత్తిడి తెచ్చారు. దీనికి ఆమె అంగీకరించకపోవడంతో వేధింపులకు గురిచేశారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ బండ్లగూడకు చెందిన ఓ మహిళ పంజాగుట్టలోని ఒక మసాజ్ సెంటరులో నెలకు లక్ష రూపాయల వేతనంతో ఫిట్నెస్ శిక్షకురాలిగా చేరింది. కస్టమర్లకు మసాజ్, శ్వాసకు సంబంధించిన వ్యాయాయం చేయించే బాధ్యతలు నిర్వాహకులు ఆమెకు అప్పగించారు.
 
కొన్ని రోజులు గడిచిన తర్వాత తమ వద్దకు వచ్చే పురుష కస్టమర్లు చెప్పినట్టు చేయాలని, అలా చేస్తేనే ఉద్యోగం ఉంటుందని నిర్వాహకులు ఆమెపై ఒత్తిడి చేయడం ప్రారంభించారు. వారికి ముద్దులివ్వాలని, వారు చెప్పినట్టు చేయాలని ఒత్తిడి చేయడంతోపాటు బెదిరింపులకు గురిచేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments