Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2024లో చంద్రబాబు చస్తారు.. జగన్ మళ్లీ సీఎం అవుతారు : వైకాపా ఎంపీ గోరంట్ల

Advertiesment
gorantla madhav
, శుక్రవారం, 27 అక్టోబరు 2023 (12:03 IST)
వైకాపాకు చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధమ్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2024లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చస్తారని, తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారంటూ ఆయన జోస్యం చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. 
 
వైకాపా చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో పాల్గొన్న గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ, 2024లో చంద్రబాబు చస్తారని, జగన్ సీఎం అవుతారని చెప్పారు. చంద్రబాబు బస్సు యాత్ర చేసి ఇపుడు జైలు యాత్ర చేస్తున్నారని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేసి ఇపుడు పారిపోయే యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 
 
ఇక నారా లోకేశ్ యువగళం యాత్ర చేసి ఇపుడు ఢిల్లీ చుట్టూ తిరిగే యాత్ర చేస్తున్నారని అన్నారు. లోకేశ్ పాదయాత్రను పక్కనపెట్టి పారిపోయారన్నారు. మరోవైపు, చంద్రబాబును ఉద్దేశించి ఈ వైకాపా ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇపుడు టీడీపీ శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి. జైల్లో చంద్రబాబుకు ఏదైనా అపకారం తలపెట్టే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించిన జస్టిస్ జ్యోతిర్మయి