Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేనకోడలిపై అత్యాచారానికి పాల్పడిన మామ.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (20:21 IST)
మేనకోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గపు మామ. ఈ దారుణ ఘటన గ్రేటర్ నోయిడాలో వెలుగుచూసింది.  వివరాల్లోకి వెళితే... కస్నాలో ఓ 38 ఏళ్ల వ్యక్తి ఒంటరిగా నివసిస్తున్నాడు. ఆయన ఇంటిపక్కనే సోదరి కుటుంబం కూడా ఉంటోంది. నిందితుడు ఒంటరిగా ఉంటుండడంతో.. వంట చేయాలని మేనకోడలిని (18) ఇంటికి రమ్మన్నాడు. దాంతో మామ ఇంటికి వచ్చిన కోడలు.. కిచెన్‎లో వంట చేస్తుండగా ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశాడు.
 
 ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దాంతో బాధితురాలు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అయితే బాధితురాలి ప్రవర్తనలో తేడా ఉండటంతో.. ఇంట్లో వాళ్లు గమనించి ఏం జరిగిందో చెప్పాలని ఒత్తిడి చేశారు. ఘటన జరిగిన రెండు నెలల తర్వాత బాధితురాలు.. తన కుటుంబసభ్యులకు విషయం చెప్పింది. వెంటనె బాధితురాలి తండ్రి.. కస్నా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేశాడు. 
 
బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు.. నిందితుడి మీద ఐపీసీ సెక్షన్ 376 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన విషయం తెలిసిన నిందితుడు.. వెంటనే పరారీ అయ్యాడు. పోలీసులు నిందితుడి కోసం సోమవారం గాలింపు చేపట్టి.. న్యూఢిల్లీకి సమీపంలోని ఖాన్‌పూర్ గ్రామంలో అరెస్ట్ చేసి.. కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments