Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రేట్ భర్త, భార్య సంతోషం కోసం ఆమె తుది శ్వాస వరకూ...

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (12:27 IST)
భయకరమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న భార్య..  ఒక్కాగానొక్క కొడుకు. భార్య మరికొద్దిరోజుల్లోనే చనిపోతుందని తెలుసు. అయినా గుండె నిబ్బరం చేసుకున్నాడు. ఆమె బతికి ఉన్నన్ని రోజులు ఎలాగైనా ఆమె అనుకున్న కోర్కెను తీర్చాలని భావించాడు. కానీ ఒకే ఒక కోరిక కోరిందామె. దాని కోసం నానా తంటాలు పడ్డాడు ఆ భర్త.
 
తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన రమేష్, జ్యోతిలకు ఆరేళ్ళ క్రితం వివాహమైంది. నాలుగేళ్ళ కొడుకు ఉన్నాడు. కానీ గత సంవత్సరంగా క్యాన్సర్ వ్యాధితో జ్యోతి బాధపడుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తన భార్య చనిపోతుందని వైద్యులు చెప్పారు.
 
దీంతో లోలోపల బాధపడ్డ రమేష్. ఆమె చనిపోయేంత వరకు సంతోషంగా ఆమెను పెట్టాలని భావించాడు. సచిన్ టెండూల్కర్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. కొచ్చిలో ఇండియన్ ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగనుంది. ఈ ఆటలో ఆడే ఆటగాళ్ళలో ఆత్మవిశ్వాసం నింపేందుకు సచిన్ వస్తున్నాడని తెలిసింది. 
 
ఈ విషయం జ్యోతికి తెలిసింది. తనకు ఇష్టమైన క్రికెటర్‌ను చూడాలంది. అంతే... రమేష్ ఎంత కష్టమైనా గంటల తరబడి క్యూలైన్లో నిలబడి ఉన్నాడు. టిక్కెట్లు అయిపోయాయి. అయితే నిర్వాహకుల దగ్గరకు వెళ్ళి ప్రాధేయపడ్డాడు. అసలు విషయం చెప్పాడు. దీంతో కరిగిపోయిన వారు ప్రత్యేకంగా రెండు టిక్కెట్లను అందజేశారు.
 
భార్యను నేరుగా స్టేడియంకు తీసుకెళ్ళాడు. సచిన్‌ను అక్కడ చూసిన జ్యోతి గట్టిగా అరిస్తూ కనిపించింది. ఎంతో ఆనందంతో ఉన్న ఆమెను చూసి భర్త కన్నీళ్ళు పెట్టుకున్నాడు. కానీ ప్రస్తుతం ఆమె లేదు. చనిపోయింది. ఇదే విషయాన్ని తన ఫేస్‌బుక్‌లో పెట్టి గుర్తు చేసుకున్నాడు రమేష్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments