Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోద ముద్ర- తలాక్ చెప్పే మూడేళ్లు జైలు

వివాదాస్పద ట్రిపుల్ తలాక్‌‌పై నిషేధం విధిస్తూ చట్టం చేయాలంటూ ఇటీవల అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. ట్రిపుల్ తలాఖ్‌ను చట్టవిరుద్ధం చేసే ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2017 (19:54 IST)
వివాదాస్పద ట్రిపుల్ తలాక్‌‌పై నిషేధం విధిస్తూ చట్టం చేయాలంటూ ఇటీవల అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. ట్రిపుల్ తలాఖ్‌ను చట్టవిరుద్ధం చేసే ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ముస్లిం మహిళల జీవితాలతో ఆటాడుకునే ట్రిపుల్ తలాక్‌పై నిషేధం విధించాలని డిమాండ్ పెరిగిన నేపథ్యంలో సుప్రీం ఆదేశాలతో రూపొందిన ముస్లీం ఉమెన్ (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు 2017కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 
 
శుక్రవారం ప్రారంభ‌మైన‌ శీతాకాల పార్ల‌మెంటు స‌మావేశాలు శనివారానికి వాయిదా ప‌డ్డాయి. ఆపై భేటీ అయిన మంత్రివర్గం ఈ బిల్లుకు ఆమోదం తెలిపి.. పార్లమెంట్‌కు పంపాలని నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లు ప్ర‌కారం ఇక‌పై మూడుసార్లు త‌లాక్ చెప్పడం చట్టప్రకారం నేరం అవుతుంది. ఈ నేరానికి గానూ దోషికి మూడేళ్ల జైలు శిక్ష ప‌డుతుంది. కాగా ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేస్తూ ఆగస్టు 22న సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ మేరకు కేంద్ర కేబినెట్ ఈ ముసాయిదా బిల్లుకు రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

టికెట్ రేట్స్ పై ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మంచిదే: తెలంగాణ చైర్మ‌న్‌ విజేంద‌ర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments