Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్నెట్ లేకుండానే మొబైల్‌లో లైవ్ టెలికాస్ట్ టీవీ ప్రసారాలు

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2023 (17:10 IST)
భవిష్యత్‌లో టీవీ చానెళ్లను మొబైల్ ఫోనులో ఎలాంటి ఇంటర్నెట్ సౌకర్యం లేకుండానే వీక్షించే సదుపాయం అందుబాటులోకి రానుంది. అయితే, ఈ టెక్నాలజీని ప్రైవేట్ టెలికాం కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం డీటీహెచ్, కేబుల్స్ రూపంలో టీవీ ప్రసారాలు వీక్షిస్తున్నాం. ఇపుడు ఈ అవసరం లేకుండానే నేరుగా డైరెక్ట్ టూ మొబైల్ (డీటీఎం) సేవలు అందించేందుకు టెలికాం శాఖ, కేంద్ర సమచార, ప్రసార శాఖ, కాన్పూర్ ఐఐటీలు పని చేస్తున్నాయి. ఈ వివరాలను అధికార వర్గాలు వెల్లడించాయి. 
 
అయితే, ఈ టెక్నాలజీని ప్రైవేట్ టెలికాం కంపెనీలు వ్యక్తిరేకించే అవకాశం లేకపోలేదు. ఈ విధానం అమల్లోకివస్తే కంపెనీల డేటా ఆదాయం తగ్గిపోయే ఆస్కారం ఉంది. టెలికాం కంపెనీలు ఇపుడు వాయిస్ కాల్స్ కంటే డేటా రూపంలోనే అధిక ఆదాయాన్ని అర్జిస్తున్నాయి. దీంతో ఈ విధానానికి ఈ కంపెనీలు అంగీకరించకపోవచ్చని నిపుణుల అభిప్రాయంగా ఉంది. కాగా, ప్రస్తుతం 21 నుంచి 22 కోట్ల కుటుంబాలకో టీవీలు ఉన్నాయి. అదే మొబైల్ ఫోన్ విషయానికి వస్తే 80 కోట్ల మంది వద్ద మొబైల్స్ ఉన్నాయి. ఈ సంఖ్య వచ్చే 2026 నాటికి 100 కోట్లకు చేరుకోవచ్చని భావిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments