Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ సీఈఒ ఆమె కోసం క్యాంపస్ బయటే వెయిట్ చేసేవారట... పిచాయ్ లవ్ స్టోరీ...

ప్రేమ... ఇది తనకు కూడా పుట్టిందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. తను చదువుకునే రోజుల్లో అంజలి అనే అమ్మాయంటే ఇష్టపడ్డాననీ, ఆమెను క్యాంపస్‌లోనే చూసినట్లు చెప్పారు. ఐతే ఆమెతో క్యాంపస్‌లో తిరగాలంటే కుదిరేది కాదని, అందువల్ల ఆమె ఉండే గర్ల్స్ హాస్ట

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2017 (12:24 IST)
ప్రేమ... ఇది తనకు కూడా పుట్టిందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. తను చదువుకునే రోజుల్లో అంజలి అనే అమ్మాయంటే ఇష్టపడ్డాననీ, ఆమెను క్యాంపస్‌లోనే చూసినట్లు చెప్పారు. ఐతే ఆమెతో క్యాంపస్‌లో తిరగాలంటే కుదిరేది కాదని, అందువల్ల ఆమె ఉండే గర్ల్స్ హాస్టలుకు వెళ్లి అక్కడ గేటు బయట వెయిట్ చేసేవాడినని గుర్తు చేసుకున్నారు. తనను అంజలి ఫ్రెండ్స్ చూసి, అంజలీ... నీ సుందర్ వచ్చాడని చెప్పేవారని వెల్లడించారు. అంజలిని అలా ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. 25 ఏళ్ల క్రిందట క్యాంపస్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని అన్నారు. 
 
అంతేకాదు సుందర్ పిచాయ్‌కి ఫేవరెట్ నటి ఉన్నారట. అంతేకాదు ఫేవరెట్ క్రికెటరూ ఉన్నాడట. ఇంతకీ ఎవరువాళ్లు అని ప్రశ్నిస్తే నవ్వుతూ ఆయన చెప్పిన సమాధానాలు. జనవరి 4న భారతదేశం వచ్చిన పిచాయ్ తను విద్యార్థిగా చదువుకున్న ఐఐటి ఖరగ్‌పూర్‌కి వెళ్లారు. అక్కడ ఆయన చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో సంభాషించారు.
 
తన ఫేవరెట్ హీరోయిన్ దీపికా పదుకునే అని చెప్పారు. అలాగే తనకు విరాట్ కోహ్లి ఆట తీరు నచ్చుతుందని చెప్పుకొచ్చారు. విరాట్ కోహ్లి ఆటను చూసేందుకు ఆసక్తిగా ఉంటానని చెప్పుకొచ్చారు. తన జీవితంలో మొదటిసారిగా కంప్యూటర్ ను చూసింది ఐఐటీ ఖరగ్‌పూర్‌లోనే అని గుర్తుందని అన్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments