Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాహనదారులకు గుడ్‌న్యూస్!

Webdunia
గురువారం, 17 జూన్ 2021 (23:13 IST)
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా శుభవార్త చెప్పింది. డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(ఆర్‌సీ) వంటి డాక్యుమెంట్ల వ్యాలిడిటీని 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ

మేరకు రోడ్డు & రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. 
 
గత ఏడాది ఫిబ్రవరి 1 నాటికి ముగిసిన అన్ని వాహన పత్రాల గడువును కేంద్ర ప్రభుత్వం గతంలో 2021 జూన్ 30 వరకు పొడిగించింది. మళ్లీ ఇప్పుడు ఆ గడువును సెప్టెంబర్ 30, 2021 వరకు పొడిగించింది.

వాహనానికి చెందిన ఫిట్‌నెస్, పర్మిట్లు, లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇతరత్రా డాక్యుమెంట్లు అన్నీ సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటు అవుతాయి.

ఈ క్లిష్ట సమయంలో పౌరులు, రవాణాదారులు ఇబ్బందులు ఎదుర్కొనకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సహకరించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments