Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్ వినియోగదారులకు శుభవార్త!

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (06:52 IST)
గ్యాస్ సిలిండర్ బుక్ చేయడానికి ఫోన్ కాల్ చేస్తున్నారా? అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఫోన్ చేయాల్సిన పని లేకుండానే సులభంగానే సెకన్లలోనే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పుడు కస్టమర్లకు వాట్సాప్ ద్వారానే సిలిండర్ బుకింగ్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. భారత్ గ్యాస్ సిలిండర్, ఇండేన్ గ్యాస్ సిలిండర్, హెచ్‌పీ గ్యాస్ ఇలా మీరు ఏ సిలిండర్ వాడుతున్నా కూడా వాట్సాప్ ద్వారా క్షణాల్లో సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.
 
వాట్సాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని భావించే వారు ముందుగా మీ గ్యాస్ సిలిండర్ కంపెనీ నంబరును మొబైల్ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం రిక్వెస్ట్ చేసుకోవాలి. సెకన్లలోనే గ్యాస్ సిలిండర్ బుక్ అయిపోతుంది. మీకు మళ్లీ రిప్లే కూడా వస్తుంది.

భారత్ గ్యాస్ ఉపయోగించే వారు 1800224344  నెంబర్‌ను వారి మొబైల్ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. తర్వాత వాట్సాప్‌లోకి వెళ్లి హాయ్ లేదా హెలో అని మెసేజ్ పెట్టాలి. తర్వాత మీకు రిప్లే వస్తుంది. తర్వాత మీరు సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.

అదే మీరు ఇండెన్ గ్యాస్ వాడితే. +917588888824 అనే నెంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. తర్వాత వాట్సాప్ లోకి వెళ్లాలి. ఇప్పుడు రీఫిల్ బుకింగ్ అని మెసేజ్ పెట్టాలి. క్షణాల్లోనే మీ సిలిండర్ బుక్ అవుతుంది.హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ వాడే వారు +919222201122 నెంబర్ ద్వారా వాట్సాప్‌లో సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.

వాట్సాప్ ప్రొఫైల్‌లో గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఎలా చేయాలనే వివరాలు కూడా ఉంటాయి. వినియోగదారులు వాటిని ఫాలో అయితే సరిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments