యూఏఈ వెళ్లే చిన్నారులకు శుభవార్త భారత్ నుంచి తమ దేశానికి వచ్చే 12 ఏళ్లలోపు వారికి కోవిడ్ టెస్ట్ అవసరం లేదని యూఏఈ ప్రకటన చేసింది.
ఈ మేరకు అధికార ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఓ ప్రయాణికుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన యూఏఈ ప్రభుత్వం..ప్రస్తుతం సవరించిన నిబంధనల మేరకు 12 ఏళ్లు పైబడిన వారికే కోవిడ్ టెస్టులు తప్పనిసరి అంటూ స్పష్టతనిచ్చింది. అయితే..ఈ విషయంలో ఏమైనా మార్పులు ఉంటే అధికారిక వెబ్ సైట్లలో వివరాలు వెల్లడిస్తామని కూడా తెలిపింది.
భారత్ నుంచి దుబాయ్, అబుధాబి, షార్జా వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ ఫలితాలను సమర్పించాల్సి ఉంటుందని యూఏఈ వివరించింది.
ఇక 12 ఏళ్ల పైబడిన వారికి మాత్రం భారత ప్రభుత్వం ఆమోదించిన ల్యాబ్ ల ద్వారా కోవిడ్ 19 పీసీఆర్ టెస్టులు తప్పనిసరి అని క్లారిటీ ఇచ్చింది. అది కూడా ప్రయాణానికి 96 గంటలలోపు టెస్ట్ ఫలితాలనే పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించింది.