పట్టుదల ఉండాలేగానీ... రెండు కాళ్ళతో నడిచి వస్తున్న బుజ్జి మేక (వీడియో)

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (13:20 IST)
చాలామంది మనుషులు అంగవైకల్యంతో బాధపడుతున్నప్పటికీ అనేక అద్భుతాలు, సాహసాలు చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తుంటారు. కానీ, కొన్ని జంతువులు కూడా అంగవైకల్యంతో బాధపడుతుంటాయి. అలాంటి జంతువులు కూడా గట్టిపట్టుదలతో ముందుకు సాగుతుంటాయి. ఈ కోవకు చెందినదే ఈ బుజ్జిమేక. 
 
తల్లి కడుపులోని భూమ్మీద పడేసమయానికే ఈ మేకపిల్లకు రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. తల్లిగర్భంలో ఉండగానే ఈ మేకపిల్లకు పక్షవాతం సోకి ముందరి కాళ్లు చచ్చుబడిపోయాయి. దాంతో ఆ యజమాని మేకపిల్ల బ్రతకదని అనుకున్నాడు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ, అచ్చం మనిషిలాగానే రెండు కాళ్లతో నడిచేస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీహార్‌లోని రాందిరీ గ్రామంలో ఈ బుజ్జిమేక పిల్ల ఇపుడు ప్రత్యేక ఆకర్షణగా ఉంది. 
 
తన బుజ్జిమేక పిల్ల బుడిబుడి అడుగులను ఆ యజమాని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇపుడు అది వైరల్‌గా మారింది. పైగా, ఈ మేకపిల్లను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు తరలివస్తున్నారు. ఆ వీడియోను మీరూ తిలకించండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

Kiran: మళ్లీశ్వరి, వెంకీ, రెడీ చిత్రాల్లా K-ర్యాంప్ చిత్రాన్ని చూడాలని అనుకుంటారు

Varalakshmi : వరలక్ష్మి శరత్ కుమార్ నిర్మాతగా దోస డైరీస్ బేనర్ లో సరస్వతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments