Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ గర్ల్ రేప్ కేసులో గోవా ఎమ్మెల్యే అరెస్టు

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (09:45 IST)
గోవా ఎమ్మెల్యే బాబుష్ మొన్సిరేట్ బండారం బయటపడింది. స్వతంత్ర ఎమ్మెల్యేగా చలామణి అవుతున్న మొన్సిరేట్ ఓ మైనర్ బాలిక అత్యాచారం కేసులో చిక్కుక్కున్న సంగతి తెలిసిందే. మార్చిలో 16ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న కారణంచేత ఎమ్మెల్యే బాబుష్ మొన్సిరేట్‌పై గోవా పోలీసులు బుధవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకుని గురువారం అరెస్ట్ చేశారు. 
 
బాలల కమిటీ ముందు బాలిక ఇచ్చిన వాంగ్మూలను పరిశీలిస్తే నేపాల్‌కు చెందిన తనను ఉద్యోగం కోసం మొన్సిరేట్‌ను కలవాల్సి ఉందని, తన సవతి తల్లి తనను మొన్సిరేట్ బంగ్లాకు తీసుకెళ్లారని చెప్పింది. అక్కడ మొన్సిరేట్ తనతో మద్యం తాగించాడని తెలిపింది. ఉదయం లేచి చూసేసరికి తన ఒంటిపై నూలుపోగు లేదని, తన శరీరం రక్తంతో తడిసిపోయి వుందని బోరున ఏడ్చేసింది. అంతేకాకుండా తన పక్కనే ఒంటి మీద బట్టలు లేకుండా నగ్నంగా కూర్చున్న ఎమ్మెల్యేని చూసి నివ్వెరపోయానని వివరించింది. 
 
రాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి కూడా అయిన మాన్‌సెరాట్ గతంలోనూ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, తన సవతి తల్లి రూ.50 లక్షలకు తనను ఎమ్మెల్యేకు అమ్మేసిందని 16 ఏళ్ల బాధితురాలు గురువారం పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపింది. ఎమ్మెల్యే తనను నిర్బంధించి మత్తు మందు ఇచ్చి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొంది. 
 
బాధితురాలికి గోవా మెడికల్ కాలేజీలో  నిర్వహించిన వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు తేలిందని అధికారులు తెలిపారు. అత్యాచారం, అక్రమ నిర్బంధం, విషప్రయోగం, మనుషుల అక్రమ రవాణా నేరారోపణలతో పలు చట్టాల కింద గోవా ఎమ్మెల్యే బాబుష్ మొన్సిరేట్‌పై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపడుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments