Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు రేపిస్టులకు సహకరించాలట.. చెప్పిందెవరంటే?

Webdunia
గురువారం, 5 డిశెంబరు 2019 (13:03 IST)
దేశ వ్యాప్తంగా దిశా ఘటన సంచలనం సృష్టించిన నేపథ్యంలో, రాజకీయ ప్రముఖులు, సినీ సెలెబ్రిటీలు ఇలాంటి ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్న నేపథ్యంలో.. డేనియ‌ల్ శ్ర‌వ‌ణ్ అనే డైరెక్ట‌ర్ మాత్రం ఈ త‌ర‌హా సంఘ‌ట‌న‌ల‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. 
 
మహిళలు అత్యాచారానికి గురయ్యేటప్పుడు రేపిస్టులకు సహకరించాలని లేకపోతే.. పోలీసులకు చెప్తారోనని మగాళ్లు చంపేస్తున్నారని చెప్పాడు. ప్రభుత్వం రేపిస్ట్‌లపై చట్టాలను రుద్దకపోతే వాళ్లు కూడా ఆడవాళ్లను హత్యలు చేయరు. 
 
ఆడాళ్ల‌పై హ‌త్య‌లు, రేప్‌లు జ‌ర‌గ‌కుండా ఉండాలంటే ఇందుకు రేప్‌ల‌ను లీగ‌లైజ్ చేయ‌డం ఒక్క‌టే మార్గం అని.. ఆడాళ్లు కూడా పోలీసులకు ఫోన్ చేసే బదులు కండోమ్స్ పెట్టుకోండి. వందకి ఫోన్లు చేసేకంటే పర్సులో కండోమ్స్ పెట్టుకుంటే మంచిది. ప్రాణాలైనా మిగులుతాయని చెప్పాడు. 
 
అలాగ‌ని తాను రేపిస్టుల‌కు స‌పోర్ట్ చేయ‌డం లేద‌ని.. 18 ఏళ్ల వ‌య‌స్సు పైన ఉన్న అమ్మాయిల‌ను హింసించ‌కుండా రేప్ చేయ‌వ‌చ్చ‌న్న నిబంధ‌న ఉంటేనే ఆడాళ్ల ప్రాణాలు ద‌క్కుతాయ‌ని చెప్పాడు. అలాగే తాను త‌ప్పు మాట్లాడి ఉంటే క్ష‌మించాల‌ని.. తాను ఆడాళ్ల ప్రాణాలు పోకుండా ఉండేందుకే ఇలా చేశాన‌ని కూడా చెప్పాడు. 
 
ఇక దిశా ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాన‌ని చెప్పాడు. దీనిపై శ్రీపాద చిన్మ‌యి లాంటి వాళ్లు శ్ర‌వ‌ణ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు శ్రవణ్‌ను తిట్టిపోస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం