Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ సీరియల్స్‌ను అనుకరించి.. స్కార్ఫ్‌తో ఉరేసుకున్న చిన్నారి

స్మార్ట్ ఫోన్లకు, టీవీలకు అతుక్కుపోయి సీరియల్స్ చూసే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇంట ఏం జరుగుతుందో మరిచిపోయి.. పిల్లలను కూడా పట్టించుకోకుండా సీరియల్స్ చూసే వారి సంఖ్య పెరుగుతూనే వుంది. టీవీ సీరియల్స్ తా

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (17:21 IST)
స్మార్ట్ ఫోన్లకు, టీవీలకు అతుక్కుపోయి సీరియల్స్ చూసే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇంట ఏం జరుగుతుందో మరిచిపోయి.. పిల్లలను కూడా పట్టించుకోకుండా సీరియల్స్ చూసే వారి సంఖ్య పెరుగుతూనే వుంది. టీవీ సీరియల్స్ తాము మాత్రమే చూడకుండా.. ఇంట్లోని చిన్నాపెద్దా తేడా లేకుండా వాటిని చూసేలా అలవాటు చేస్తున్న మహిళలకు ఈ ఘటన ఓ హెచ్చరిక లాంటిది.
 
ఇంతకీ ఏం జరిగిందంటే.. టీవీ సీరియల్స్ చూసిన ఓ బాలిక అచ్చం అందులో చేసుకున్నట్లే.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్కార్ఫ్‌తో ఉరి వేసుకుంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, ఇచ్చాపుర్‌ పట్టణంలో చోటుచేసుకుంది. తల్లిదండ్రులు ఇంట లేకపోవడంతో చిన్నారి ఈ ఘాతుకానికి పాల్పడి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. 
 
ఆపై ఇంటికొచ్చి బాలిక ఉరేసుకోవడాన్ని గమనించిన తల్లిదండ్రులు షాకయ్యారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. ఆ బాలిక అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు నిర్ధారించారు. తమ కూతురు సీరియళ్ల వచ్చే సన్నివేశాలను అనుకరించేదని.. అయితే ఇలాంటి ఘోరానికి పాల్పడుతుందనుకోలేదని.. చిన్నారి తల్లిదండ్రులు వాపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments