Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్ బాలిక ప్రాణం తీసింది.. కడుపు నొప్పితో కుప్పకూలింది..

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (11:43 IST)
లాక్ డౌన్ కారణంగా ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. బతుకుదెరువు కోసం వెళ్లిన బాలిక ఇంటికి కొద్ది దూరంలో చనిపోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లాకు చెందిన జమ్లో మక్దం(12) అనే బాలిక రెండు నెలల క్రితం తెలంగాణకు బతుకుదెరువు కోసం వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో మిరప తోటలో పనికి చేరింది ఆ బాలిక. 
 
లాక్‌డౌన్‌ కారణంగా పనులు ఆగిపోయాయి. పూట గడవడం లేదు. దీంచో ఊరెళ్లాలని సదరు బాలికతో పాటు మరో 11 మంది నిర్ణయించుకున్నారు. దీంతో ఏప్రిల్‌ 15వ తేదీన తాము పని చేస్తున్న మిరప తోట ప్రాంతం నుంచి బీజాపూర్‌కు కాలినడకన బయల్దేరారు.
 
రహదారి వెంట వెళ్తే పోలీసులు అడ్డుకుంటారని భావించి.. వారు అడవి మార్గాన్ని ఎంచుకున్నారు. మొత్తానికి ఆ బాలిక గ్రామానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. శనివారం మధ్యాహ్నం తీవ్రమైన కడుపు నొప్పితో బాలిక బాధపడింది. అక్కడే కుప్పకూలిపోయింది.
 
సమాచారం అందుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని బాలికను ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ బాలికకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చింది. పోషకాహారం వల్లే బాలిక మృతి చెందిందని వైద్యులు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments