Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీయని మాటలు చెప్పి ఎంపీనే బుట్టలో వేసుకున్న కి'లేడీ'

ఓ కిలాడీ యువతి చెప్పిన తియ్యటి మాటలకు ఓ ఎంపీ బుట్టలో పడిపోయాడు. ఆ తర్వాత ఆ ఎంపీని తన ఇంటికి పిలిచి... మత్తుమందు కలిపిన శీతలపానీయం ఇచ్చింది. పిమ్మట పడకగదిలోకి తీసుకుని బట్టలూడదీసి వీడియో తీసి.. దాని చూ

Webdunia
సోమవారం, 1 మే 2017 (09:38 IST)
ఓ కిలాడీ యువతి చెప్పిన తియ్యటి మాటలకు ఓ ఎంపీ బుట్టలో పడిపోయాడు. ఆ తర్వాత ఆ ఎంపీని తన ఇంటికి పిలిచి... మత్తుమందు కలిపిన శీతలపానీయం ఇచ్చింది. పిమ్మట పడకగదిలోకి తీసుకుని బట్టలూడదీసి వీడియో తీసి.. దాని చూపి బ్లాక్‌మెయిల్ చేస్తూ వచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ఢిల్లీలోని ఓ ఎంపీ వద్దకు ఓ మహిళ సాయం కోసం వచ్చింది. ఆ తర్వాత ఆమె చెప్పిన తీయని మాటలకు ఆ ఎంపీ లొంగిపోయాడు. ఆ తర్వాత ఘజియాబాద్‌లోని తన ఇంటికి పిలిచింది. అక్కడ కూల్ డ్రింకులో మత్తుమందు కలిపి ఇచ్చింది. దాన్ని సేవించగానే ఆ ఎంపీ మత్తులోకి జారుకున్నారు. ఆ తర్వాత తాను అనుకున్న పనిని ఆ మహిళ పూర్తి చేసింది. 
 
ముఖ్యంగా ఎంపీతో సన్నిహితంగా ఉన్నట్లు అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియో తీసింది. ఈ వీడియో, ఫోటోలు చూపించి రూ.5 కోట్లు ఇవ్వాలని లేకుంటే అత్యాచారం కేసు పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేసింది. ఈ వేధింపులు తట్టుకోలేని ఆ ఎంపీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఎంపీ ఫిర్యాదుపై తాము ఐపీసీ సెక్షన్ 384 కింద కేసు నమోదు చేసి, ప్రత్యేక క్రైం బ్రాంచ్ బృందంతో దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ ప్రత్యేక పోలీసు కమిషనర్ ముఖేష్ మీనా చెప్పారు. ప్రస్తుతం ఆ మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, ఎంపీ పేరును పోలీసులు వెల్లడించలేదు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నిహారిక కొణిదెల మూవీ ప్రారంభం

Dil Raju: సినిమా పైరసీ కంటే సోషల్ మీడియా పైరసీ దోపీడితో సమానమే : దిల్ రాజు

బట్టల రామస్వామి బయోపిక్ అంత సోలో బాయ్ హిట్ కావాలి : వివి వినాయక్

Komali Prasad: అవాస్తవాల్ని నమ్మకండి అసత్యాల్ని ప్రచారం చేయకండి - కోమలి ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments