Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుపై శివసేన వ్యంగ్యాస్త్రాలు... డూప్లికేట్ తాళం చెవితో...

Webdunia
సోమవారం, 20 మే 2019 (12:48 IST)
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై శివసేన వ్యంగ్యాస్త్రాలు సంధించింది. డూప్లికేట్ తాళంతో అధికారం కోసం వెంపర్లాడుతున్నారంటూ విమర్శలు గుప్పించింది. 
 
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబు ముమ్మరంగా కృషి చేస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, వివిధ రాష్ట్రాల్లోని బీజేపీయేతర విపక్ష పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 
ఇప్పటికే ఆయన బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేష్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్‌లతో భేటీ అయ్యారు. సోమవారం ఆయన కోల్‌కతాకు వెళ్లి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశంకానున్నారు.
 
ఈ పరిణామాలన్నింటిని నిశితంగా గమనించిన శివసేన... వ్యంగాస్త్రాలు సంధించింది. ఢిల్లీలో చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ప్రజలకు వినోదాన్ని పంచుతున్నాయంటూ వ్యాఖ్యానించింది. డూప్లికేట్ తాళం చెవితో అధికారం కోసం పాకులాడుతున్నారంటూ ఎద్దేవా చేసింది. 
 
తాను స్వయంగా పాలిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చంద్రబాబు ఓడిపోతారంటూ ఆ పార్టీ వ్యాఖ్యానించింది. ఎన్నికల ప్రచారంలో ఐదు ప్రాంతీయ పార్టీల నేతలు తామే ప్రధానమంత్రి అంటూ ప్రచారం చేసుకున్నాయని మే 23 తర్వాతే వీటితో ఐక్యత తేలుతుందన్నారు. మోడీకే మెజార్టీ వస్తున్నట్టు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నా చంద్రబాబు వ్యర్ధ ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments