Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజ గురువు రామోజీతో చంద్రబాబు ఏంమాట్లాడారు..?

Advertiesment
Chandrababu Naidu
, శుక్రవారం, 17 మే 2019 (11:24 IST)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుతో భేటీ అయ్యారు. ఈ నెల23వ తేదన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న తరుణంలో వీరిద్దరూ భేటీకావడం ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అసలు రామోజీ రావుని చంద్రబాబు ఎందుకు కలిశారు? ఏయే అంశాలు ఇద్దర మధ్య చర్చకు వచ్చాయి.? ఇలా అనేక అంశాలు పలు చర్చలకుకు దారితీస్తున్నాయి. 
 
బుధవారం అమరావతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో అనుకున్న సమయాని కంటే 15 నిమిషాలు లేటుగా చంద్రబాబు రామోజీ ఫిలిం సిటీకి చేరుకున్నారు. చంద్రబాబుకు రామోజీ రావు కోడలు, మార్గదర్శి ఎం.డి శైలజా కిరణ్ స్వాగతం పలికి రామోజీరావు దగ్గిరకు తీసుకెళ్లారు. తర్వాత చంద్రబాబు రామోజీ రావుతో  సుమారు 2 గంటలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 
 
అదేసమయానికి ఈనాడు ఎండీ కిరణ్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఉన్నా చంద్రబాబును కవలకపోవడం విశేషం. కేవలం టీవీ9 మాజీ సీ.ఈ.ఓ రవిప్రకాష్‌ను కాపాడడానికే ఇద్దరూ భేటీ అయ్యారని ఓ ప్రధాన పత్రిక కథనం ప్రచురించినా, ఆ అంశాన్ని రాజకీయ విశ్లేషకులు రామోజీరావు అంతరంగికులు తేలిగ్గా  కొట్టిపారేస్తున్నారు. 
 
అయితే వీరిద్దరి భేటీకి తాజా రాజకీయ అంశాలే ప్రధాన ఎజెండాగా జరిగినట్టు సమాచారం. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. ఏయే పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయి అనే అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. టీడీపీకి ప్రతికూలంగా ప్రజల తీర్పు ఉంటే పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది, కేంద్రంలో చంద్రబాబు ఎటువంటి పాత్ర పోషించాలి. హంగ్ పార్లమెంట్ వస్తే ప్రధాన అభ్యర్థిగా ఎవరిని ప్రతిపాదించాలి. శరద్ పవార్ లేదా మమతా బెనర్టీలకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది. లేదా చంద్రబాబే ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రొజెక్టు అయితే వివిధ పార్టీల నుంచి మద్దతు ఎలా ఉంటుంది అనే అంశాలు చుట్టూనే వీరి భేటీ జరిగిందనేది సమాచారం. 
 
ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే ఎటువంటి పరిణామాల ఉంటాయి అనే అంశాలపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ మరలా  అధికారంలోకి వస్తుందని, సంక్షేమ పథకాలు  గెలిపిస్తాయని  రామోజీరావుకి చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. బీజేపీకి మద్దతు ఇవ్వడం అనివార్యమైతే ప్రధాని అభ్యర్థిగా మోడీగాకుండా నితిన్ గడ్కరీ అయితే మద్దతిస్తే ఎలా ఉంటుంది అనే అంశాలు ప్రధానంగా చర్చించుకున్నట్టు తెలిసింది. మొత్తంగా చంద్రబాబు, రామోజీ కలయిక వార్త ఇప్పుడు  ఏపీ, తెలంగాణ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబై బార్‌లో డ్యాన్సర్లతో అధికారుల అసభ్య నృత్యాలు...