తీహార్ జైలులో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ హత్య

Webdunia
మంగళవారం, 2 మే 2023 (10:20 IST)
దేశ రాజధాని ఢిల్లీలోని తిహార్ జైలులో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ హత్యకు గురయ్యాడు. ఖైదీల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల్లో ప్రత్యర్థి ఖైదీలు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన గ్యాంగ్‌స్టర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడి మంగళవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో జరిగిందని జైలు అధికారులు వెల్లడించారు. 
 
తీహార్ జైలులోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో హై రిస్క్‌ వార్డ్‌లో ఉన్న టిల్లు తాజ్‌పురియా అలియాస్‌ సునిల్‌ మాన్‌పై మరో గ్యాంగ్‌స్టర్‌ యోగేశ్‌ తుండా, అతడి అనుచరులు దాడి చేశారు. ఇనుప రాడ్లతో తీవ్రంగా కొట్టారు. జైలు అధికారులు గమనించి దాడిని అడ్డుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన టిల్లును హుటాహుటిన దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
కాగాద టిల్లు తాజ్‌పురియా ఢిల్లీలోని అత్యంత క్రూరమైన క్రిమినల్‌ గ్యాంగ్‌కు నేతృత్వం వహిస్తున్నాడు. 2015లో ఓ కేసులో అరెస్టయి అప్పటి నుంచి తీహార్ జైలులోనే ఉంటున్నాడు. టిల్లు గ్యాంగ్‌కు ఢిల్లీకి చెందిన మరో గ్యాంగ్‌స్టర్‌ జితేందర్‌ గోగితో ఏళ్ల తరబడి శత్రుత్వం ఉంది. ఈ గ్యాంగ్ ముఠా సభ్యులో ఈ హత్యకు పాల్పడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments