Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ భర్తను విడిచిపెట్టాలంటే నువ్వు రావాలంటూ తీస్కెళ్లి 13 రోజుల పాటు...

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (18:29 IST)
అబలపై మరో అత్యాచార దుర్ఘటన జరిగింది. 13 రోజుల పాటు బందీగా ఉంచి సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసునంటూ అబద్ధాలు చెప్పి తీసుకువెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. నలసోపారాలోని ప్రగతినగర్‌కు చెందిన బాధితురాలి ఇంటికి ఈ నెల 6వ తేదీన పోలీసునంటూ ఓ వ్యక్తి వచ్చాడు. 
 
ఆమె భర్తను ఓ కేసు మీద అరెస్ట్ చేసామని, అతడిని విడిపించుకోవాలంటే తనతోపాటు రావాలని కొత్తగా పెళ్లైన ఆ యువతికి (21) చెప్పాడు. అది నమ్మి వచ్చిన ఆ యువతిని ఆటోలో తీసుకువెళ్లాడు. ఉత్తర ముంబయిలో మలద్‌లో ఉన్న ఓ ఇంట్లో ఎనిమిది రోజులుపాటు బంధించాడు. ఈ దారుణానికి ఓ మహిళతో పాటు నలుగురు సహాయం చేసారు. 
 
బంధించిన ఆమెపై ఇద్దరు వ్యక్తులు పదేపదే అత్యాచారం చేసారు. ఆ తర్వాత మీరా రోడ్డులో నిర్మాణంలో ఉన్న మరో ఇంటికి బదిలీ చేశారు. ఆక్కడ కూడా ఆ వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఇంట్లో ఈ నెల 18 వరకూ బందీగా ఉంచారు. 18వ తేదీన వారు ఆమెను విడిచిపెట్టగానే సరాసరి పోలీసుల వద్దకు వెళ్లింది. జరిగిందంతా వివరించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments