Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతరిక్షంలోకి నలుగురు వ్యోమగాములను పంపించనున్న ఇస్రో...

వరుణ్
మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (10:54 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో కీలక ఘట్టానికి తెరతీసింది. అంతరిక్షంలోకి నలుగురు వ్యోమగాములను పంపించేందుకు సిద్ధమవుతుంది. ఆ నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ప్రకటిస్తారని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 
 
తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం సందర్శనలో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లే నలుగురు వ్యోమగాముల పేర్లను వెల్లడిస్తారని తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. వ్యోమగాముల పేర్లు ప్రకటించడానికి ముంద ప్రధాని నరేంద్ర మోడీ వారిని కలుస్తారని తెలిపారు. వీఎస్‌ఎస్‌సీలో ప్రధాన పర్యటించనుండటం చాలా సంతోషంగా ఉందని సోమనాథ్ తెలిపారు. 
 
కాగా, గగన్‌యాన్ మిషన్ ప్రాజెక్టు ప్రయోగం 2025లో చేపట్టనున్నారు. మానవులను అంతరిక్షంలోకి పంపించి, తిరిగి తీసుకునిరాగల సత్తా ఇస్రోకు ఉందని చాటి చెప్పడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా ఉంది. భారత ప్రాదేశిక జలాల్లో వ్యోమగాములు సురక్షితంగా ల్యాండింగ్ చేయనున్నారు. వీఎస్ఎస్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ ప్రపంచ స్థాయి సాంకేతిక సౌకర్యాలకు ఉద్దేశించి మూడు అంతరిక్ష మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. వీటి విలువ రూ.1800 కోట్లుగా ఉంది. 
 

సంబంధిత వార్తలు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments