Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎరుపెక్కిన ఇంద్రావతి నది : నీటిపై తేలాడుతున్న మృతదేహాలు

ఇద్రావతి నది ఎరుపెక్కింది. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టుల శరీరం నుంచి ధారగా ప్రవహించిన రక్తం ఈ నది నీటిలో కలిపోయింది. దీంతో నది నీరు ఎరుపురంగులోకి మారిపోయింది. ఈ నక్సలైట్లలో ప్రా

Webdunia
బుధవారం, 25 ఏప్రియల్ 2018 (10:09 IST)
ఇద్రావతి నది ఎరుపెక్కింది. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టుల శరీరం నుంచి ధారగా ప్రవహించిన రక్తం ఈ నది నీటిలో కలిపోయింది. దీంతో నది నీరు ఎరుపురంగులోకి మారిపోయింది. ఈ నక్సలైట్లలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మంగళవారానికి 37కు చేరుకున్న విషయం తెల్సిందే.
 
తెలంగాణ - మహారాష్ట్ర - చత్తీస్‌గడ్ సరిహద్దులో ఆదివారం నుంచి రెండు భారీ ఎన్‌కౌంటర్లు జరిగిన విషయం తెల్సిందే. ఈ ఎన్‌కౌంటర్ ప్రాణాలు కోల్పోయిన వారిలో మావోయిస్టు అగ్రనేత కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గడ్చిరోలి జిల్లా భామ్రాగఢ్‌ తహసీల్‌లో ఇంద్రావతి నదీ పరీవాహక ప్రాంతంలోని తాడ్‌గావ్‌ అటవీ ప్రాంతంలో నక్సల్స్ పెద్ద ఎత్తున సమావేశమైనట్టు పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతోనే ఈ దాడి జరిగింది. 
 
దీనిని గమనించిన మావోలు కాల్పులు ప్రారంభించడంతో, పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. గంటన్నరపాటు జరిగిన ఈ కాల్పుల్లో 16 మంది మృతి చెందారు. వీరిలో 9 మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన కొందరు తప్పించుకున్నారు. ఆ తర్వాత సోమవారం మరో ఎన్‌కౌంటర్ జరిగింది. 
 
ఆ తర్వాత మృతదేహాల కోసం ఇంద్రావతి నదిలో గాలిస్తున్న పోలీసులకు కుళ్లిన స్థితిలో ఉన్న మరికొన్ని మృతదేహాలు కనిపించాయి. తాజాగా దొరికిన మృతదేహాలతో కలిపి మొత్తం మృతుల సంఖ్య 37కు చేరుకున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. కాగా, పోలీసులు స్వాధీనం చేసుకున్న మొత్తం మృతదేహాల్లో 19 మంది మహిళలవి కాగా, 18 మంది పురుషులవి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments