Webdunia - Bharat's app for daily news and videos

Install App

జి20 సమ్మిట్ : మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవు

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2023 (17:47 IST)
జి20 శిఖరాగ్ర సదస్సు 2023 ఢిల్లీ వేదికగా జరుగనుంది. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని అన్ని విద్యా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మూసేవుంటాలని కేంద్రం తెలిపింది. 
 
కాగా, ఈ సమ్మిట్‌ ఈ నెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగనున్నాయి. అయితే, ఆయా సభ్య దేశాల అధినేతల భేటీ మాత్రం సెప్టెంబరు 9, 10 తేదీల్లో జరుగుతుంది. భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీ20 దేశాధినేతల సదస్సుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అయితే, బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ కంపెనీలు మాత్రం యధావిధిగా పని చేస్తాయని తెలిపింది. 
 
దేశం పేరు "బీజేపీ"గా మార్చుతారా? సీఎం కేజ్రీవాల్ 
 
జి20 శిఖరాగ్ర సదస్సు విందుకు భారత రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. పేరు మార్పుపై తనకైతే అధికార సమాచారం లేదన్నారు. బీజేపీని గద్దెదించేందుకు విపక్షాలు కూటమిగా ఏర్పడి ఇండియా అని పేరు పెట్టుకున్నారని గుర్తుచ ేశారు. 
 
తాము అలా పేరు పెట్టుకున్నందుకే కేంద్రం I.N.D.I.A. పేరును తొలగించి భారత్ అని మారుస్తుందా? అని ప్రశ్నించారు. ఈ దేశం 140 కోట్ల మందిదని, ఏదో ఒక పార్టీకి చెందినది కాదన్నారు. ఒకవేళ ప్రతిపక్ష కూటమి I.N.D.I.A. అని కాకుండా "భారత్" అని పేరు పెట్టుకుంటే అప్పుడు దేశం పేరును బీజేపీగా మారుస్తారా? అని చురక అంటించారు.
 
అలాగే, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశం ఒక రాజకీయ పార్టీకి చెందినది కాదన్నారు. జీ20 సమ్మిట్ విందు ఆహ్వాన పత్రికలపై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడం అందరిలోను అనుమానాలకు తావిచ్చిందని, పేరు మార్పుపై ఇది చర్చకు దారి తీసిందన్నారు. ఇష్టానుసారంగా మార్చడానికి ఈ దేశం బీజేపీ సొత్తు కాదన్నారు. జుడేగా భారత్.. జీతేగా ఇండియా అంటూ చద్దా పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిసున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments