ఐస్‌క్రీమ్‌లో కప్ప.. వాంతులు చేసుకున్న చిన్నారులు ఎక్కడ?

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (13:22 IST)
ఐస్‌క్రీమ్‌లో కప్ప వుండటం చూడకుండా తిన్న చిన్నారులు అస్వస్థతకు గురైనారు. ఈ ఘటన తమిళనాడు మధురైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధురై కోవలన్ నగర్ మణిమేగల వీధికి చెందిన అన్బుసెల్వం. ఆయన భార్య జానకిశ్రీ.కుమారస్వామి ఆలయానికి వెళ్లారు. ఆయన తన కుమార్తెలు మిత్రశ్రీ (వయస్సు 8), రక్షణశ్రీ (7), ధరణి (4)లను కూడా వెంట తీసుకెళ్లాడు.
 
ఆ తర్వాత గుడి సమీపంలోని శీతల పానీయాల దుకాణంలో పిల్లలకు జిగర్తాండను కొనుగోలు చేశాడు. ఇది తాగిన ముగ్గురు చిన్నారులు ఒక్కసారిగా వాంతులు చేసుకున్నారు. దీంతో అనుమానం వచ్చిన జానకిశ్రీ పిల్లలు తాగే జిగర్తాండను కొనుగోలు చేసింది. 
 
అప్పుడు అందులో ఉంచిన ఐస్‌క్రీమ్‌లో ఒక కప్ప చనిపోయి పడి ఉంది. అనంతరం వాంతులు చేసుకున్న ముగ్గురు చిన్నారులను సమీపంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వారికి వైద్యులు చికిత్స అందించారు
 
ఐస్‌క్రీమ్‌లో కప్ప పడి ఉండడంపై జానకిశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శీతల పానీయాల దుకాణం యజమాని దురైరాజన్ (60)ని పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

తర్వాతి కథనం
Show comments