Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో మరో ఉచితం... బస్టాండ్లు, మాల్స్‌లో 'అమ్మ వైఫై'

తమిళనాడులో మరో ఉచితం అమల్లోకి వచ్చింది. ఇప్పటికే మంచి నీటి నుంచి సిమెంట్ వరకూ, ఔషధాల నుంచి భోజనం వరకూ కొన్ని అతి తక్కువ ధరకూ, మరికొన్ని ఉచితంగా అందిస్తూ, ఎన్నో 'అమ్మ' పథకాలను ప్రారంభించిన తమిళనాడు సర్

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (11:07 IST)
తమిళనాడులో మరో ఉచితం అమల్లోకి వచ్చింది. ఇప్పటికే మంచి నీటి నుంచి సిమెంట్ వరకూ, ఔషధాల నుంచి భోజనం వరకూ కొన్ని అతి తక్కువ ధరకూ, మరికొన్ని ఉచితంగా అందిస్తూ, ఎన్నో 'అమ్మ' పథకాలను ప్రారంభించిన తమిళనాడు సర్కారు, తాజాగా యువతకు దగ్గరయ్యేలా ఉచిత వైఫే సేవలు కల్పించనుంది. 
 
రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన పెద్ద బస్టాండ్లు, మాల్స్ లో 'అమ్మ ఉచిత వైఫై' సెంటర్లను ప్రారంభించాలని నిర్ణయించింది. పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తొలి దశలో 50 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. 
 
హైయ్యర్ సెకండరీ, కాలేజ్ విద్యాభ్యాసం చేస్తున్న వారికి కూడా ఉచిత ఇంటర్నెట్‌ను అందించనున్నామని తెలిపింది. తొలిదశలో 50 పాఠశాలల్లో రూ.10 కోట్ల వ్యయంతో వైఫై టవర్లు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. ఇందుకోసం షోలింగనల్లూర్ ప్రాంతంలో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణముండే ఇంటిగ్రేటెడ్ ఐటీ కాంప్లెక్స్‌ను రూ.80 కోట్లతో నిర్మించేందుకు ఆదేశాలు జారీ చేసింది. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments