Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడ్డాగా మారిన ఛత్తీస్‌గఢ్‌.. 25 మంది కిడ్నాప్.. నలుగురు హతం

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (17:09 IST)
Mavoists
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం మావోయిస్టులకు అడ్డాగా మారింది. ప్రతిరోజు ఏదో ఒక చోట అలజడి సృష్టించడం, ఘాతుకానికి పాల్పడటం జరుగుతూనే ఉంటాయి. ఇందుకు పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఆపరేషన్‌ నిర్వహిస్తూ ఉంటారు. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా ప్రతి నిత్యం పోలీసు బలగాలు గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నాయి. అయినా మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. 
 
తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో మావోలు ఘాతుకానికి పాల్పడ్డారు. బీజాపూర్‌ జిల్లాలో మావోలు మెటాపాల్‌ కుస్నార్‌ గ్రామానికి చెందిన 25 మందిని కిడ్నాప్‌ చేశారు. పోలీసు ఇన్‌ఫార్మర్‌ నెపంతో గ్రామస్థులను కిడ్నాప్‌ చేసినట్లు తెలుస్తోంది. 
 
రెండు రోజుల కిందట కిడ్నాప్‌ చేసిన మావోయిస్టులు.. ప్రజా కోర్టు నిర్వహించినట్లు తెలుస్తోంది. వారిలో నలుగురిని హతమార్చారు. అందులో ఐదుగురిని విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన దంతెవాడ, బీజాపూర్‌ జిల్లా సరిహద్దులో శుక్రవారం రాత్రి జరిగినట్లు సమాచారం. ఇంకా 16మంది మావోయిస్టుల చెరలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments