Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్సీపీ చీఫ్ నివాసంలో కరోనా కలకలం .. ముంబైను క్రాస్ చేసిన పూణె

Webdunia
సోమవారం, 17 ఆగస్టు 2020 (13:16 IST)
మహారాష్ట్రకు చెందిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ నివాసంలో కరోనా కలకలం సృష్టించింది. ఆయన ఇంట్లో ఏకంగా నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి రాజేశ్ తోపే వెల్లడించారు. అయితే, అదృష్టవశాత్తు శరద్ పవార్‌కు మాత్రం నెగెటివ్ వచ్చిందని తెలిపారు. 
 
ఎన్సీపీ చీఫ్ నివాసంలో పని చేసే వంట మ‌నిషి, ఇద్ద‌రు సెక్యూరిటీ సిబ్బందితో పాటు మ‌రొక‌రికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఈ క్ర‌మంలో శ‌ర‌ద్ ప‌వార్ ముంబైలోని బ్రీచ్ క్యాండి ఆస్ప‌త్రిలో ఆదివారం ప‌రీక్ష‌లు చేయించుకోగా ఫ‌లితం నెగిటివ్ వ‌చ్చిన‌ట్లు మంత్రి తెలిపారు. కొద్ది రోజుల వ‌ర‌కు ఆయ‌న ప‌లు కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండ‌నున్నారు. 
 
ఇదిలావుండగా, దేశంలో క‌రోనా వైర‌స్ హాట్‌స్పాట్ కేంద్రంగా ముంబై న‌గ‌రం ఉండేది. కానీ, ఇప్పుడు క‌రోనా హాట్‌స్పాట్‌గా పుణె మారింది. గ‌త రెండు మూడు రోజుల నుంచి పుణె జిల్లాలో క‌రోనా కేసులు అధికంగా న‌మోదు అవుతున్నాయి. 
 
పుణె జిల్లాలో 1,30,606 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, ముంబైలో 1,28,726 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. మ‌హారాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 5,95,865కు చేరింది. మ‌ర‌ణాల సంఖ్య 20,037కు చేరిన‌ట్లు ఆ రాష్ట్ర వైద్యాధికారులు వెల్ల‌డించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అఖిల్, నాగ చైతన్య వివాహాలు ఒకే వేదికపై జరుగుతాయా? నాగ్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments