Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మాజీ మంత్రి సుఖరామ్ ఇకలేరు..

Webdunia
బుధవారం, 11 మే 2022 (10:55 IST)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుఖ్‌రామ్ ఇకలేరు. ఆయన 94 యేళ్ళ వయసులో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన్ను ఈ నెల 7వ తేదీన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలోచేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ గత రాత్రి కన్నుమూసినట్టు ఆయన మనవడు ఆశ్రయ్ శర్మ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. దీంతో పాటు తన తాతతో కలిసి ఉన్న చిన్ననాటి ఫోటోను కూడా షేర్ చేశారు. 
 
కాగా, ఈ నెల 4వ తేదీన సుఖ్‌రామ్ మనాలిలో ఉండగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో ఆయన్ను మండిలోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. ఇందుకోసం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ప్రత్యేక చర్యలు తీసుకుని ప్రభుత్వ హెలికాఫ్టర్‌ను కూడా పంపించారు. 
 
కాగా, సుఖ్‌రామ్ గత 1993 నుంచి 1996 వరకు కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. ఐదుసార్లు విధాన సభకు, మూడు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్థక శాఖా మంత్రిగా కూడా పనిచేశారు. ఆ సమయంలో ఆయన రాష్ట్ర రైతుల ఆదాయం పెంపుకోసం విస్తృతంగా కృషి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments