ప్రధాని మోడీ మోసం చేశారు.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా : మాజీ జవాను
సమాన స్థాయికి సమాన పింఛను (ఓఆర్ఓపీ) పథకాన్ని అమలు చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోసం చేశారంటూ ఆరోపిస్తూ ఓ మాజీ జవాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మాజీ సైనికుడు రామ్ కిషన్ గరేవాల్. ఆయన జంతర్ మంతర్ వద్ద
సమాన స్థాయికి సమాన పింఛను (ఓఆర్ఓపీ) పథకాన్ని అమలు చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోసం చేశారంటూ ఆరోపిస్తూ ఓ మాజీ జవాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మాజీ సైనికుడు రామ్ కిషన్ గరేవాల్. ఆయన జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం కొనసాగిస్తూ, మంగళవారం రాత్రి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పారు.
ఓఆర్ఓపీకి సంబంధించిన డిమాండ్లను నెరవేర్చడంలో ప్రధాని మోడీ ప్రభుత్వం విఫలమైనందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని తెలిపారు. ఆయన ఏదో విష పదార్థాన్ని సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. హర్యానాలోని భివానీకి చెందిన గరేవాల్ ఓ సూసైడ్ నోట్‌ను తన వద్ద ఉంచుకున్నారు. 6వ, 7వ వేతన కమిషన్ల ప్రయోజనాలను మోడీ ప్రభుత్వం తిరస్కరించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ దారుణానికి పాల్పడ్డాడు.