Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనెతుట్టెలో వేలెట్టాడు.. అంతే ప్రాణాలను లాగేసిన తేనెటీగలు..

Webdunia
బుధవారం, 10 జులై 2019 (13:37 IST)
తేనెతుట్టెలో వేలెట్టాలంటేనే వామ్మో అంటూ చాలామంది జడుసుకుంటారు. అయితే కేరళలో ఓ వ్యక్తి తేనెతుట్టెలో వేలెట్టాడు. అంతే ఆ తేనెటీగలు ప్రాణాలను లాగేశాయి. వివరాల్లోకి వెళితే.. కేరళలోని తేనెతుట్టెలో చేతిని పెట్టిన ఓ కార్మికుడి తేనెటీగలు వెంబడించి మరీ కుట్టి చంపేశాయి. కేరళ, కన్నూరు ప్రాంతానికి చెందిన బాబు అనే వ్యక్తి.. ఓ రబ్బర్ తోటలో కూలీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 
 
ఇలా రబ్బర్ తోటలో పనిచేస్తుండగా.. తెలియకుండా ఓ చెట్టుపై వున్న తేనెతుట్టెలో వేలు తగిలింది. వెంటనే ఆ తుట్టెలో వున్న తేనెటీగలు.. ఆతనిపై దాడి చేశాయి. వెంటనే చెట్టుపై నుంచి కిందికి దూకేశాడు. తోటి కార్మికులు అక్కడ నుంచి పారిపోయారు. 
 
కానీ బాబును వెంబడించి మరీ ఆ తేనెటీగలు కుట్టాయి. శరీరం మొత్తం తేనెటీగలు కుట్టేయడంతో బాబు స్పృహ తప్పిపడిపోయాడు. అంతలో పారిపోయిన సహ కూలీలు నిప్పు కర్రలతో వచ్చారు. వెంటనే బాబును ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స ఫలించక బాబు ప్రాణాలు కోల్పోయాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments