Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులు ఓవరాక్షన్.. జీపుపై మహిళను కట్టేసి.. ఊరంతా తిప్పారు..

పోలీసులు ఓవరాక్షన్ చేశారు. మీరట్‌లో నిన్నటికి నిన్న ముస్లిం యువకుడిని ప్రేమించిందనే కారణంగా ఓ యువతిపై మహిళా పోలీసులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (14:39 IST)
పోలీసులు ఓవరాక్షన్ చేశారు. మీరట్‌లో నిన్నటికి నిన్న ముస్లిం యువకుడిని ప్రేమించిందనే కారణంగా ఓ యువతిపై మహిళా పోలీసులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన మరవక ముందే పోలీసులు కర్కశంగా ప్రవర్తించారు. పోలీస్ జీపుపై మహిళను కట్టేసి.. పోలీసులు ఊరంతా తిప్పారు. ఈ ఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని చవిందా దేవి గ్రామంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఓ ఆస్తి వ్యవహారంలో నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో నిందితుడు ఇంట్లో లేడు. ఇక కుమారుడు, ఇంట్లో వుండి మహిళ భర్తను తీసుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ పోలీసులను ఆ మహిళ అడ్డుకుంది. భర్తను, కుమారుడుని తీసుకెళ్లేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన పోలీసులు ఆమెను బలవంతంగా జీపు పైన కట్టేసి ఊరంతా తిప్పారు. 
 
ఆ వేగానికి ఆమె జీపు పైనుంచి కిండపడిపోయి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితురాలి బంధువులు పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. 
 
తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. దీంతో ప్రభుత్వం స్పందించి ఘటనపై విచారణకు ఆదేశించింది. మహిళను అలా జీపుపై కట్టేసి తిప్పడం ఏమిటని నెటిజన్లు కూడా పోలీసులపై మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments