Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు ఐదేళ్ల బుడ్డోడు

Webdunia
సోమవారం, 25 మే 2020 (21:04 IST)
పాలబుగ్గల పసితనం ఇంకా వీడని ఐదేళ్ల బుజ్జాయి ఈ రోజు బెంగళూరు విమానాశ్రయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఒంటరిగా విమానం దిగుతుంటే చుట్టుపక్కల వాళ్ల నోళ్లు వెళ్లిబెట్టి చూశాడు.

స్పెషల్ కేటగిరీ కింద బుడ్డోడు ఏ మాత్రం భయపడకుండా జర్నీ చేశాడు. బెంగళూరుకు చెందిన విహాన్ శర్మ అనే పిల్లాడు లాక్‌డౌన్‌కు ముందు ఢిల్లీలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. లాక్‌డౌన్ వల్ల తిరిగి రాలేక అక్కడే చిక్కుకుపోయాడు.

తల్లిదండ్రులపై బెంగతో రోజులు వెళ్లదీశాడు. దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కావడంతో విహాన్ ప్రయాణానికి బంధువులు ఏర్పాట్లు చేశాడు. బుడ్డోడికి మాస్కు, ప్లాస్టిక్ షీల్డ్ గ్లవుజులు తొడిగి భద్రంగా స్పెషల్ కేటగిరీ కింది విమానం ఎక్కించారు.

సిబ్బంది వాడికి సీట్ బెల్ట్ తగిలించి మరింత జాగ్రత్తగా చూసుకున్నారు. విమానం బెంగళూరులోని కెంపేగౌడ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది.

వాడి కోసం కళ్ల కాయలు కాచేలా ఎదురు చూస్తున్న తల్లి బిడ్డ కనిపించగానే ఒడిలోకి తీసుకుంది. విహాన్ మీడియాకు స్పెషల్ కేటగిరీ బోర్డు చూపెడుతూ మరింత సందడి చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

నరేష్ అగస్త్య కొత్త చిత్రం మేఘాలు చెప్పిన ప్రేమ కథ

స్క్రిప్ట్, దర్శకుడి ని బట్టి సినిమాలు అంగీకరిస్తున్నా : కామాక్షి భాస్కర్ల

హీరోయిన్ రష్మిక మందన్నా ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

విక్రమ్ కొత్త చిత్రం విడుదలకు ఉన్న చిక్కులేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments