పశువుల యజమానికి ఐదు చెప్పు దెబ్బలు.. గ్రామ సర్పంచ్ నిర్ణయం

Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (17:13 IST)
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామ పంచాయతీ తీసుకున్న నిర్ణయం ఇపుడు వివాదాస్పదమైంది. ఈ గ్రామంలోని పశువులు ఆరుబయట స్వేచ్ఛగా తిరేగందుకు వీలు లేదని నిబంధన విధించింది. ఇది వివాదాస్పదమైంది. దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు, వెంటనే ఆ నిబంధనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, పంచాయతీ సిబ్బంది మాత్రం గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కొత్త నిబంధన గురించి వివరిస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని షాహ్‌దోల్‌ జిల్లా నగ్నాదుయ్‌ గ్రామస్థులు తమ పశువులను వీధుల్లో స్వేచ్ఛగా తిరగనివ్వకూడదని ఆ గ్రామ సర్పంచ్‌ కొత్త నిబంధనను తీసుకొచ్చారు. పశువుల నిర్వహణలో గ్రామస్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించడంతోపాటు, రోడ్లపై వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పంచాయతీ సిబ్బంది తెలిపారు. 
 
ఒకవేళ ఎవరైనా తమ పశువులను గ్రామంలోని వీధుల్లో తిరిగేందుకు విడిచిపెడితే.. వాటి యజమానికి ఐదు చెప్పు దెబ్బలతోపాటు, రూ.500 జరిమానా విధిస్తామని చాటింపు వేయించారు. ఈ మేరకు గ్రామంలో కొత్త నిబంధనపై ప్రకటన చేయించారు. అయితే, ఈ ప్రకటన విన్న గ్రామస్థులు మాత్రం ఇదేం వింత నిబంధన అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వాధికారులు జోక్యం చేసుకొని.. నిబంధనను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments