జార్ఖండ్ రాష్ట్రంలో భారీ ఎన్‌కౌంటర్ - ఐదుగురి మావోల హతం

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (09:45 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఐదుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు మావోలకు బుల్లెట్ గాయాలు తగలడంతో వారు గాయపడ్డారు. అలాగే సంఘటనా స్థలం నుంచి మావోల డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
జార్ఖండ్ రాష్ట్రంలోని పలాము - ఛాత్రా జిల్లాలోని సరిహద్దులో నక్సల్స్ దాగివున్నారన్న సమాచారంతో జార్ఖండ్ పోలీసులు, సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్ఎపీఎఫ్) సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా ఇరు వర్గాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్టు ఛాత్రా ఎస్పీ రాకేశ్ రంజన్ తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు చనిపోయారని, మరికొందరు బుల్లెట్ గాయాలైనట్టు పేర్కొన్నారు. 
 
ఘటనా స్థలం నుంచి ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అలాగే, భారీ మొత్తంలో ఆయుధాలతో పాటు ఇతర సామాగ్రిని చేసుకున్నట్టు ఎస్పీ వివరించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారిలో రూ.25 లక్షల రివార్డు ఉన్న స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు గౌతమ్ పాశ్వాన్ కూడా ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments