Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం... ఆరుగురు రోగుల సజీవ దహనం

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2020 (09:01 IST)
గుజరాత్ రాష్ట్రంలో ఓ విషాదకర సంఘటన జరిగింది. కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో ఆగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కరోనా వైరస్ రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం రాజ్‌కోట్‌, మావ్‌డీ ప్రాంతంలోని శివానంద్ జనరల్ అండ్ మల్టీ స్పెషాలిటీ ట్రస్ట్ ఆసుపత్రిలో జరిగింది. 
 
ఈ ఆస్పత్రిని కోవిడ్ కేర్ ఆస్పత్రిగా మార్చగా, ఇక్కడ మొత్తం 33 మంది కరోనా రోగులు చికిత్స పొందుతూ వచ్చారు. మంటలు తొలుత ఐసీయూ వార్డులో చెలరేగి ఆ తర్వాత ఆసుపత్రి మొత్తం వ్యాపించినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
 
ఈ ప్రమాదంలో వీరిలో ఏడుగురు ఐసీయూలో చికిత్స పొందుతుండగా, ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. చికిత్స పొందుతున్న మరో 27 మందిని కాపాడి మరో ఆసుపత్రికి తరలించారు.
 
ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments