Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిశువుకు జన్మనిచ్చిన ఐదో తరగతి విద్యార్థిని.... కర్ణాటకలో దారుణం

కర్ణాటక రాష్ట్రంలో ఐదో తరగతి విద్యార్థిని పండంటి శిశువుకు జన్మనిచ్చింది. ఇంతకీ తమ బిడ్డ గర్భందాల్చినట్టు తెలిసినప్పటికీ... తల్లిదండ్రులు అత్యంత గోప్యంగా ఉంచి పాఠశాలకు పంపించారు. ఈ వివరాలను పరిశీలిస్తే

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2016 (11:04 IST)
కర్ణాటక రాష్ట్రంలో ఐదో తరగతి విద్యార్థిని పండంటి శిశువుకు జన్మనిచ్చింది. ఇంతకీ తమ బిడ్డ గర్భందాల్చినట్టు తెలిసినప్పటికీ... తల్లిదండ్రులు అత్యంత గోప్యంగా ఉంచి పాఠశాలకు పంపించారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
కర్ణాటక రాష్ట్రం, చామరాజనగర జిల్లాలోని మలెమహాదేశ్వర బెట్ట వద్ద ఉన్న పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న బాలిక ఇక్కడి సమీపంలోని సాంఘికసంక్షేమ హాస్టల్లో ఉంటూ విద్యాభ్యాసం కొనసాగిస్తోంది. కొంతకాలంగా చదువుకు దూరంగా ఉన్న బాలిక ఇటీవల జూన్ 16న తిరిగి పాఠశాలలో చేరింది. 
 
శుక్రవారం ఉదయం హాస్టల్ నుంచి స్కూల్‌కు వచ్చిన బాలిక మధ్యాహ్నం సమయంలో తీవ్రంగా బాధపడుతుండటంతో సహచరులు ఉపాధ్యాయురాలికి తెలిపారు. వెంటనే ఆమె ఆయాతో కలిసి బాత్‌రూంకు తీసుకెళ్లారు. కొద్దిసేపటికే బాలిక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం ఉపాధ్యాయురాలు వెంటనే ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్, విద్యాశాఖ అధికారులకు సమాచారం చేరవేశారు.
 
ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చేరవేయగా, వారు ఆస్పత్రికి చేరుకుని, తమ కుమార్తె గర్భదాల్చిన విషయం తెలుసునని, ఈ విషయం తెలిస్తే పాఠశాలలో చేర్చుకోరని తాము ఈ విషయం చెప్పలేదని తెలిపారు. తమ కుమార్తెను ఆమె మేనమామ ప్రేమిస్తున్నానని, ఇలా గర్భవతిని చేశాడని ఈ విషయం ఎవరితో చెప్పవద్దని తమ కుమార్తె కోరిందని వారు అధికారులకు తెలిపారు. ప్రస్తుతం తల్లి, పిల్ల ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments