Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆపరేషన్ గంగ' : ఢిల్లీకి చేరిన ఐదో విమానం

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (11:05 IST)
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా చిక్కుల్లో పడిన భారతీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం "ఆపరేషన్ గంగ" అనే పేరుతో ప్రత్యేక విమానాలను నడుపుతోంది. ఈ విమానాల్లో ఉక్రెయిన్‌లోని భారత పౌరులు, విద్యార్థులను సరిహద్దు దేశాలైన రొమేనియా, పోలాండ్ తదితర దేశాలకు తరలించి అక్కడ నుంచి స్వదేశానికి తీసుకొస్తుంది. 
 
ఈ 'ఆపరేషన్ గంగ'లో భాగంగా తొలి విమానం తొలుత ముంబైకు వచ్చింది. ఆ తర్వాత రెండో విమానం ఢిల్లీకి, మూడో విమానం హైదరాబాద్‌కు చేరుకోగా, నాలుగు, ఐదు విమానాలు ఢిల్లీకి వచ్చాయి. 
 
తాజాగా ఢిల్లీకి వచ్చిన ఐదో విమానంలో 249 మంది విద్యార్థులు, పౌరులు సురక్షితంగా మాతృభూమికి చేరుకున్నారు. వీరిలో ఏపీ, తెలంగాణాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. తెలంగాణాకు చెందిన 11 మంది, ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్థులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం