ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్ దేశంలో చిక్కుకునివున్న భారతపౌరులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం ఆపరేషన్ గంగా పేరుతో అక్కడ ఉన్న భారత ప్రజలతో పాటు భారతీయ విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తుంది.
ఈ ఆపరేషన్ గంగాలో భాగంగా ఉక్రెయిన్ దేశ సరిహద్దులకు సమీపంలో ఉన్న రొమేనియా రాజధాని బుడాఫెస్ట్‌కు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాలు నడుపుతుంది. ఈ విమానాల్లో తొలి ఫ్లైట్ శనివారం రాత్రి ముంబైకు చేరుకుంది.
ఈ విమానంలో 469 మంది వచ్చారు. ఆదివారం ఉదయం మరో విమానం వచ్చింది. ఇందులో 219 మంది ఉన్నారు. పశ్చిమ ఉక్రెయిన్ నుంచి 28 మంది తెలుగు విద్యార్థులతో మూడో విమానం శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చింది. ఢిల్లీ, ముంబైలకు వచ్చిన విమానాల్లో వచ్చిన తెలుగు విద్యార్థులను తమతమ రాష్ట్రాలకు తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.