Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టాలిన్ నన్ను కిడ్నాప్ చేశారా? అలాంటి ఘటన?: న్యూస్ రీడర్ ఫాతిమాబాబు

దూరదర్శన్‌ తమిళ ఛానల్‌లో న్యూస్ రీడర్‌గా పనిచేసిన ఫాతిమాబాబును డీఎంకే నేత స్టాలిన్ కిడ్నాప్ చేశారని వదంతులు చలామణి అవుతూనే వున్నాయి. ఈ వదంతులకు ఫాతిమాబాబు క్లారిటీ ఇచ్చారు. అప్పట్లో పాపులర్ న్యూస్ రీడ

Webdunia
శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (18:16 IST)
దూరదర్శన్‌ తమిళ ఛానల్‌లో న్యూస్ రీడర్‌గా పనిచేసిన ఫాతిమాబాబును డీఎంకే నేత స్టాలిన్ కిడ్నాప్ చేశారని వదంతులు చలామణి అవుతూనే వున్నాయి. ఈ వదంతులకు ఫాతిమాబాబు క్లారిటీ ఇచ్చారు. అప్పట్లో పాపులర్ న్యూస్ రీడర్ అయిన ఈమెను స్టాలిన్ అపహరించుకుపోయారని వదంతులు వచ్చాయి.


కానీ ఆ వార్తల్లో నిజం లేదని.. ఆ వదంతులను విని షాక్ అయ్యానని ఫాతిమాబాబు అన్నారు. తన జీవితంలో అలాంటి ఘటనే జరగలేదని.. స్టాలిన్ లాంటి వ్యక్తి పరువుకు భంగం కలిగించే ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకువస్తాయో తనకు తెలియట్లేదని ఫాతిమాబాబు అన్నారు. 
 
న్యూస్ రీడరే కాకుండా సినీ నటిగానూ రాణించిన ఈమె ఓ ధారావాహికలో నటించడం పూర్తయ్యే వరకు వార్తలు చదవకూడదనే నియమం వుండేదని.. అందుకే నిబంధనల ప్రకారం కొన్ని రోజుల పాటు వార్తలు చదివేందుకు దూరంగా వుండాల్సి వచ్చిందని.. ఈ గ్యాప్‌లోనే ఇలాంటి వదంతులు వచ్చాయని ఫాతిమా బాబు వివరణ ఇచ్చారు. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి ప్రతిష్టకు కళంకం తెచ్చేలా ఇలాంటి వదంతులు రావడం దారుణమని ఫాతిమా బాబు తెలిపారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments