Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నకూతురిని స్నేహితులకు గిఫ్ట్‌గా ఇచ్చి.. అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఎక్కడ?

ఉత్తరప్రదేశ్ నేరాలకు అడ్డాగా మారిపోతుంది. మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోభేదం లేకుండా కామాంధులు మహిళలపై విరుచుపడుతున్నారు. అయితే కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ తండ్రి కిరాతకుడిగా మారా

Webdunia
గురువారం, 19 ఏప్రియల్ 2018 (13:30 IST)
ఉత్తరప్రదేశ్ నేరాలకు అడ్డాగా మారిపోతుంది. మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోభేదం లేకుండా కామాంధులు మహిళలపై విరుచుపడుతున్నారు. అయితే కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ తండ్రి కిరాతకుడిగా మారాడు. రక్తం పంచుకుపుట్టిన కన్నకూతురిపైనే కన్నేశాడు.



కన్నకూతురిపై లైంగిక దాడి చేయడమే కాకుండా.. కన్నకూతురుని అతడి స్నేహితులకు కూడా పంచిపెట్టాడు ఆ దుర్మార్గుడు. తన స్నేహితులతో కలిసి కన్నకూతురిపై ఆ కామాంధ తండ్రి అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన సోమవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. 50 ఏళ్ల నిందితుడైన తండ్రి తన కూతురు (35)తో కలిసి ఏప్రిల్ 15 సాయంత్రం ఓ జాతరకు వెళ్లారు. అనంతరం అతడు తన స్నేహితుడైన మాన్ సింగ్‌కు ఫోన్ చేసి పిలిపించాడు. స్నేహితులతో కలిసి జాతరకు వెళ్తున్నామని కూతురుకి నచ్చజెప్పాడు. ఆపై స్నేహితులతో పాటు నిందితుడు.. అతడి స్నేహితుడైన మిరాజ్ అనే వ్యక్తి ఇంటికి తీసుకెళ్లాడు.
 
ఆ ఇంట్లోనే కన్నకూతురిని తన స్నేహితులకు ఆ నీచ తండ్రి గిఫ్ట్‌గా ఇచ్చాడు. స్నేహితులతో కలిసి కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన తర్వాత 18 గంటల పాటు ఆమెను మిరాజ్ తన ఇంట్లోనే బంధించేశాడు. తండ్రి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు.. తల్లి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో మిరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి తండ్రి, అతడి మరో స్నేహితుడు మాన్ సింగ్ పరారీలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం