Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో దారుణం: నలుగురు పిల్లల్ని గొంతుకోసి చంపేశాడు.. ఆపై ఉరేసుకున్నాడు..

సెల్వి
గురువారం, 27 మార్చి 2025 (12:11 IST)
యూపీలో దారుణం చోటుచేసుకుంది. యూపీ, రోజా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో 36 ఏళ్ల వ్యక్తి తన నలుగురు పిల్లలను గొంతు కోసి చంపి, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని గురువారం పోలీసులు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. మన్పూర్ చాచారి గ్రామానికి చెందిన రాజీవ్ కుమార్ తన ముగ్గురు కుమార్తెలు స్మృతి (12), కీర్తి (9), ప్రగతి (7), ఐదేళ్ల కుమారుడు రిషబ్‌లను హత్య చేశాడని పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ ద్వివేది తెలిపారు. రాజీవ్ వారి గొంతులను పదునైన ఆయుధంతో కోసి బుధవారం రాత్రి తన ఇంట్లోని మరో గదిలో ఉరి వేసుకున్నాడని పోలీసులు తెలిపారు. 
 
రాజీవ్ ఉదయం తలుపు తెరవకపోవడంతో, పైకప్పు ఎక్కి మెట్ల గుండా ఇంటి లోపలికి వెళ్ళి మృతదేహాలను వెలికితీశారు. ఏడాది క్రితం జరిగిన ప్రమాదంలో రాజీవ్ తలకు తీవ్ర గాయమై చికిత్స పొందుతున్నాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. సంఘటన జరిగిన ముందు రోజు భార్య ఆమె పుట్టింటికి వెళ్ళింది. ఈ సంఘటన వెనుక గల కారణం ఇంకా నిర్ధారించబడలేదని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments