Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా భయంతో భార్యకు ముద్దుపెట్టలేక పోయానంటున్న కాశ్మీరీ నేత!

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (12:01 IST)
జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు అందరికీ తెగనవ్వు తెప్పిస్తున్నాయి. జమ్మూలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ అత్యంత విచిత్రమైన పరిస్థితులను కల్పించిందన్నారు. చివరికి నిర్భయంగా తన భార్యకు ముద్దు కూడా ఇవ్వలేకపోయానని వాపోయారు.
 
దేశ రాజకీయాల్లో ఉన్న నేతల్లో ఫరూక్ అబ్దుల్లా ఒకరు. ఈయన నోటి వెంట ఈ మాట రాగానే అక్కడున్నవారంతా పెద్దపెట్టున నవ్వారు. కరోనా భయాల కారణంగా షేక్‌హ్యాండ్ ఇచ్చుకోలేకపోతున్నామని, కావలించుకోవాలంటే మరింత భయపడుతున్నామన్నారు. 
 
చివరికి తాను తన భార్యకు ముద్దు కూడా పెట్టలేకపోయానని, ఇక ఆలింగనం సంగతి అసలే లేదన్నారు. తన మనుసులో ఉన్నది దాచుకోకుండా చెప్పేశానని అన్నారు. ఈ మాటలు విన్నవెంటనే అక్కడున్నవారంతా హాయిగా నవ్వుకున్నారు. 
 
ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలతో కూడిన వీడియోను అక్కడున్నవారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా కోవిడ్-19 టీకా గురించి మాట్లాడిన ఫరూక్ అబ్దుల్లా... టీకాను అభివృద్ధి చేయడంలో భారత్ విజయవంతమైందన్నారు. పైగా, ఇతర ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలవడం ఆనందంగా ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments