Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుల ఉద్యమానికి స్వస్తి.. అన్ని కేసులన్నీ ఎత్తివేసిన కేంద్రం

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (08:11 IST)
రైతులు చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. రైతుల డిమాండ్లకు కేంద్రం తలగొగ్గింది. ఉద్యమం సమయంలో రైతులపై నమోదైన అన్ని కేసులను ఎత్తివేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో తమ ఉద్యమాన్ని విరమించుకుంటున్నట్టు రైతులు ప్రకటించారు. రైతుల డిమాండ్ల పరిష్కారనికి కేంద్రం లిఖిత పూర్వక హామీ ఇచ్చింది. 
 
అలాగే, ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించే విషయంపై కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. దీంతో రైతులు తమ ఉద్యమాన్ని విరమించుకున్నారు. శనివారం నుంచి విజయ కవాతుతో తమ స్వస్థలాలకు రైతులు ఉద్యమ ప్రాంతాన్ని వీడి తమ స్వస్థలాలకు వెళ్లనున్నారు. 
 
కేంద్రం తెచ్చిన మూడు వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు మహోద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇది యేడాదిన్నరగా సాగుతూ వచ్చింది. రైతుల ఉద్యమంతో పాటు ఇటీవల వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చావుదెబ్బతిన్నది. దీంతో దిగివచ్చిన కేంద్రం సాగు చట్టాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రటించారు. 
 
ఆ తర్వాత ఈ చట్టాల రద్దుపై పార్లమెంట్‌లోనూ బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించింది. ఇపుడు రైతుల డిమాండ్ల పరిష్కారానికి కూడా కేంద్రం సమ్మతించింది. అలాగే, ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలకు పరిహారం అందజేసేందుకు కూడా ఉత్తరప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలు సమ్మతించాయి. దీంతో ఉద్యమాన్ని విరమించుకుంటున్నట్టు ప్రకటించారు. 
 
కానీ, డిమాండ్ల పరిష్కారంలో మార్గం ప్రభుత్వాలు వెనకడుగు వేస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఫలితంగా శనివారం నుంచి రైతులు తమతమ స్వస్థలాలకు వెళ్లనున్నారు. విజయ కవాతుతో రైతులు తమ ఊర్లకు వెళుతారని రైతు నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ వెల్లడించారు. రైతులు చారిత్రాత్మక విజయాన్ని సాధించారన్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments