Publish Date: Fri, 10 Dec 2021 (00:17 IST)
Updated Date: Fri, 10 Dec 2021 (00:19 IST)
ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ
కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి
శ్రీ శాంభవీతి జగతాం జననీపరేతి
వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి
లలితాదేవీ, నీ యొక్క పవిత్రమైన పేరును కామేశ్వరి అని, కమలయనీ, మహేశ్వరియని, శ్రీ శాంభవీ అని, జగత్తులకు తల్లివనీ, వరదేవతవనీ, వాగ్దేవతవనీ, త్రిపురేశ్వరివనీ ఉదయాన్నే స్మరించే నన్ను కాపాడు తల్లీ.