ఎవరికైనా ఓ శిశువు పుట్టిందనగానే నక్షత్రం, ఏం శాంతులు చేయాల్సి వుంది, ఎన్నో పాదం అని చూస్తారు. మొత్తం వున్న 27 నక్షత్రాల్లో అసలు ఏమాత్రం హోమాలు, శాంతులు అవసరం లేనటువంటి నక్షత్రాలు 10 మాత్రమే.
మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, స్వాతి, అనూరాధ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, ఉత్తరాభాద్ర అనేవి. మిగిలిన నక్షత్రాల్లో కనీసం ఏదో ఒక పాదంలో పుట్టినవారికైనా శాంతుల అవసరం వుంటుంది.