Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ తినేందుకు వెళ్లాడు.. బలైపోయాడు.. చెట్టు కొమ్మలు బాలుడిపై పడిపోవడంతో?

బిర్యానీ తినేందుకు వెళ్ళిన ఓ బాలుడు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఢిల్లీకి చెందిన ఓ ఏడేళ్ల బాలుడు స్నేహితులతో కలిసి జందేవాలన్ సమీపంలో ఉన్న ఫైజ్ రోడ్డులోని ఎంసీడీ కాంప్లెక్స్‌కు వెళ్లాడు. అయితే

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (13:40 IST)
బిర్యానీ తినేందుకు వెళ్ళిన ఓ బాలుడు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఢిల్లీకి చెందిన ఓ ఏడేళ్ల బాలుడు స్నేహితులతో కలిసి జందేవాలన్ సమీపంలో ఉన్న ఫైజ్ రోడ్డులోని ఎంసీడీ కాంప్లెక్స్‌కు వెళ్లాడు. అయితే కార్పోరేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల ఆ నిండు ప్రాణం బలైపోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఓ ఏడేళ్ల బాలుడు స్నేహితులతో కలిసి జందేవాలన్ సమీపంలో ఉన్న ఫైజ్ రోడ్డులోని ఎంసీడీ కాంప్లెక్స్‌లో బిర్యానీ తినడానికి వెళ్లాడు. 
 
అదే సమయంలో.. బిర్యానీ షాపును ఆనుకుని ఉన్న ఎంసీడీ కాంప్లెక్స్ గోడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నిర్మాణ పనులకు అడ్డుగా ఉన్న ఓ చెట్టును తొలగించడానికి ప్రయత్నించారు అధికారులు. దీంతో చెట్టు కొమ్మలన్ని బిర్యానీ షాపుపై ఒరిగాయి. ఆపై అప్పటికే స్వల్పంగా ధ్వంసమై ఉన్న గోడ కాస్త... బిర్యానీ తింటున్న బాలుడితో పాటు పలువురిపై కూలిపోయింది. ఈ దుర్ఘటనలో బాలుడు అక్కడిక్కడే చనిపోగా.. మరో ఏడుగురు గాయపడ్డారు.
 
ఈ ఘటనలో బాధాకరమైన విషయం ఏమిటంటే? చనిపోయిన బాలుడి తండ్రి కూడా ఆ గోడ నిర్మాణం కోసం వచ్చిన కూలీల్లో ఒకడు కావడమే. కొడుకు చావును జీర్ణించుకోలేక ఆ తండ్రి గుండెలవిసేలా రోధించాడు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments