Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 వరకు విదేశీయుల వీసా గడువు పెంపు

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (08:16 IST)
భారత్​లో ఉన్న విదేశీయుల వీసా గడువును  కేంద్రం సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. గడువు ముగిసేంతవరకు సాధారణ వీసా లేదా ఈ-వీసా కలిగిన వారు.. ఎలాంటి ఓవర్ స్టే పెనాల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
 
అఫ్గాన్ పౌరులకు సైతం.. ఈ గడువు వర్తిస్తుందని తెలిపింది. కొవిడ్​ కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దై.. స్వదేశానికి వెళ్లలేక పోయిన విదేశీయులకు వీసా గడువు పొడిగించింది భారత ప్రభుత్వం. 
 
అంతకుముందు ఆగస్టు 31వరకు ఉన్న గడువును.. ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  అన్ని రకాల వీసాలకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.
 
మార్చి, 2021 వరకు వివిధ రకాల వీసాల ద్వారా భారత్​కు వచ్చి కరోనా కారణంగా విమాన సర్వీసులు రద్దై.. భారత్​లోనే చిక్కుకున్న వారికోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికార ప్రతినిధి తెలిపారు. 
 
భారత్​లో ఉన్న విదేశీయులకు.. ఎలాంటి ఓవర్​ స్టే పెనాల్టీ విధించకుండా వీసా గడువును పొడిగిస్తున్నామన్నారు. విదేశీయులు.. ఫారనర్స్ రీజనల్​​ రిజిస్ట్రేషన్​ కార్యాలయాల్లో(ఎఫ్​ఆర్​ఆర్​ఓ) ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదన్నారు.

ఎవరికైనా సెప్టెంబర్ 30 తర్వాత కూడా.. వీసా గడువు కావాలంటే ఎఫ్​ఆర్​ఆర్​ఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసు కోవాలన్నారు. అఫ్గాన్ పౌరులకు కూడా.. ఇదివరకు చెప్పిన విధంగానే గడువును పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments