Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మాజీ మంత్రి పీఆర్ సతీమణి హత్య.. ఇంట్లో శవమై..?

Webdunia
బుధవారం, 7 జులై 2021 (10:31 IST)
PR Kumaramangalam Wife
కేంద్ర మాజీమంత్రి పీఆర్ కుమారమంగళం భార్య మంగళవారం రాత్రి ఢిల్లీలోని నివాసంలో హత్యకు గురయ్యారు. కిట్టి కుమారమంగళం (67) దక్షిణ ఢిల్లీలోని వసంత్‌విహార్ ప్రాంత ఇంట్లో శవమై బుధవారం ఉదయం కనిపించారు. దిండుతో ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చంపారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 
 
కిట్టీ కుమారమంగళం హత్య కేసులో నిందితుడు ఒకరిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య కేసులో మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో హత్య ఘటన చోటు చేసుకుందని పోలీసులు పేర్కొన్నారు.
 
కిట్టీ కుమారమంగళం సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ఆమె భర్త పీ రంగరాజన్‌ కుమారమంగళం మొట్టమొదట 1984 లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో 1991-92 మధ్య కేంద్ర మంత్రిగా పనిచేశారు. అనంతరం బీజేపీలో చేరారు. 
 
వాజ్‌పేయి ప్రభుత్వ కాలంలో 1998లో ఆయన విద్యుత్‌శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె కుమారుడు రంగరాజన్‌ మోహన్‌ కుమారమంగళం కాంగ్రెస్‌ నేత. బెంగళూరులో నివాసం ఉంటుండగా.. తల్లి హత్య వార్త తెలుసుకున్న వెంటనే ఢిల్లీకి బయలుదేరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments